ETV Bharat / city

Ap cm jagan: 2022 నుంచి అమ్మఒడి పథకం హాజరుకు అనుసంధానం.. - విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష వార్తలు

అమ్మఒడి స్ఫూర్తి కొనసాగిస్తూ... పిల్లలంతా బడిబాట పట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ (cm jagan news) అన్నారు. 2022 నుంచి అమ్మఒడి పథకం.. హాజరుకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకుసాగాలని అధికారులకు సూచించారు.

Ap cm jagan
Ap cm jagan
author img

By

Published : Oct 11, 2021, 4:44 PM IST

అమ్మఒడి స్ఫూర్తి కొనసాగాలి, పిల్లలంతా బడిబాట పట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ (cm jagan news) అన్నారు. 2022 నుంచి అమ్మఒడి పథకం.. హాజరుకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే నిర్దేశించుకున్నామని.. ఈ ఏడాది ఈ నిబంధనను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

విద్యాశాఖపై సమీక్షించిన సీఎం.. స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరుతో పాటు అమ్మఒడి, విద్యాకానుకపై చర్చించారు (CM Jagan review meeting on education department news). కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, హాజరుపై ఆరా తీశారు. స్కూళ్ల పనితీరుపై ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారులు ప్రతిపాదన చేశారు. సోషల్ అడిట్ ద్వారా ర్యాంకింగ్​లు ఇస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన జగన్‌... ఏ మార్పులైనా ఉపాధ్యాయులతో మాట్లాడాలని అన్నారు.

'2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకుసాగాలి. ఏ మార్పులైనా ఉపాధ్యాయులతో మాట్లాడాలి. ఎయిడెడ్‌ స్కూళ్లను బలవంతం చేయట్లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. అప్పగింత అనేది స్వచ్ఛందం అన్న విషయాన్ని స్పష్టం చేయాలి. ఎయిడెడ్‌ యాజమాన్యాలు అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుంది' - ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ఇదీ చదవండి: విద్యాశాఖ కీలక నిర్ణయం.. పదో తరగతిలో ఈ ఏడాది 6 పరీక్షలే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.