CM REVIEW: వ్యవసాయ మెటార్లకు మీటర్ల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ రైతులకు లేఖలు రాయాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రైతుపై ఒక్కపైసా కూడా భారం పడదని.. బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లించే విషయాన్ని వివరించాలని సీఎం సూచించారు. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ వల్ల.. అక్కడ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిన విషయం రైతులకు వివరించాలన్నారు. విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం.. మీటర్ల కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని చెప్పారు. వ్యవసాయ పంపుసెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
థర్మల్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డిమాండ్ ఉంటే పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూడాలని.. ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరగాలన్నారు. సులియారీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి మెరుగ్గా జరిగేలా చూడాలని సూచించారు.
ఇవీ చదవండి: