ETV Bharat / city

'నిన్ను చూస్తే గర్వంగా ఉంది హర్ష'.. కుమార్తె గురించి జగన్ ట్వీట్ - jagan daughter harsha reddy

AP CM Jagan Tweet about Daughter : ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ప్యారిస్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకున్నారు. జగన్ కుమార్తె హర్షా రెడ్డి ప్యారిస్‌లో చదువుతుండగా.. తన స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. అనంతరం తన ఎదుగుదలను చూసి గర్విస్తున్నట్లు ట్విటర్​ ద్వారా తెలిపారు.

AP CM Jagan Tweet about Daughter
AP CM Jagan Tweet about Daughter
author img

By

Published : Jul 3, 2022, 11:26 AM IST

  • Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT

    — YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP CM Jagan Tweet about Daughter ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ప్యారిస్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్​ కుమార్తె హర్షా రెడ్డి ప్యారిస్‌లో చదువుతోంది. జులై 2న ఆమె కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన కూతురు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్విటర్​లో ట్వీట్ చేశారు.

"డియర్‌ హర్ష.. నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇన్‌సీడ్‌ (INSEAD) బిజినెస్‌ స్కూల్‌ నుంచి డిస్టింక్షన్‌లో పాస్‌ కావడమే కాకుండా డీన్స్‌ లిస్ట్‌లో నీ పేరు చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నా." -ఏపీ సీఎం జగన్ ట్వీట్

జూన్ 28న సీఎం జగన్ దంపతులు ప్యారిస్​ పర్యటనకు వెళ్లగా.. జులై 3న తిరిగి విజయవాడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులకు మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ రఘురాం, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం తాడేపల్లి నివాసానికి వెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.