Cm Jagan Quash Petition: ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు కొట్టివేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్... హైకోర్టును ఆశ్రయించారు. 2014లో హుజూర్‌నగర్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారన్న అభియోగం మేరకు జగన్‌పై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసుపై నిన్న (సోమవారం) నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. జగన్కు ఇంకా సమన్లు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. ఈనెల 31లోగా జగన్కు సమన్లు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో జగన్.. హైకోర్టును ఆశ్రయించారు. జగన్ హాజరుపై న్యాయస్థానం ఏప్రిల్ 26 వరకు స్టే విధించింది.
CM JAGAN Huzurnagar Case: రాష్ట్రంలోని హుజూర్‌నగర్‌లో జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసుపై.. నిన్న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. 2014లో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారన్న అభియోగం మేరకు జగన్‌పై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జగన్కు ఇంకా సమన్లు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 31లోగా జగన్కు సమన్లు అందించాలని టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: CM JAGAN Huzurnagar Case: 'ఈనెల 31లోగా జగన్కు సమన్లు అందించండి'