మంచి పాలన అందిస్తుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. తన మతం, కులం గురించి కొందరు ఆరోపణలు చేస్తున్నారనీ.. నా మతం-మానవత్వం.. నా కులం-మాట నిలబెట్టుకోవడమని ఉద్ఘాటించారు. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. 43 వేల బెల్ట్‌షాపులు రద్దుచేశామనీ.. పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. మంచి సమాజాన్ని ఇవ్వాలనేదే తన లక్ష్యమనీ.. మంచి పాలన అందితే ప్రజలు సంతోషంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.
మాట నిలబెట్టుకున్నా
ఉపాధి లేని రోగులు పస్తులుండకుండా ఆరోగ్యశ్రీ ఆసరా ఇచ్చి.. పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా శస్త్రచికిత్సల తర్వాత రోజుకు రూ. 225 లేదా నెలకు రూ. 5 వేలు ఆర్థికసాయం అందజేయనున్నారు. లబ్ధిదారులకు సీఎం జగన్ చెక్కులు అందజేశారు. 836 చికిత్సలకు ఈ పథకం వర్తించునుంది. డిశ్చార్జి అయిన 48 గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాకు ఈ సాయం జమ అవుతుంది. ఒకవేళ సొమ్ము అందకపోతే 104 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి అడగొచ్చని సీఎం తెలిపారు.
ఇవీ చదవండి..