ETV Bharat / city

AP CM JAGAN: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సీఎం జగన్ భేటీ - ఒడిశా సీఎంతో జగన్ భేటీ వార్తలు

ఏపీ, ఒడిశా సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. భువనేశ్వర్​లో ఒడిశా సీఎంతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించారు.

cm jagan - odisha cm
cm jagan - odisha cm
author img

By

Published : Nov 9, 2021, 7:25 PM IST

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. ఉభయ రాష్ట్రాల మధ్య కీలక అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. నేరడి బ్యారేజీ, జంఝావతి ప్రాజెక్ట్‌ సమస్యలతో పాటు కొఠియా గ్రామాల సమస్యలు భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. ఏపీ, ఒడిశా సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇరువురు సీఎంలు ప్రకటించారు.

రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కమిటీ ఏర్పాటవుతుందని వెల్లడించారు. సమావేశానికి ముందు ఒడిశా తెలుగు సంఘం ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిసి కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి: MLC Elections: తెలంగాణలో ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నేటినుంచే కోడ్ అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.