తిరుమలలో నిర్మించిన నూతన బూందీ పోటుతో పాటూ.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ హిందీ, కన్నడ చానళ్లను.. ఏపీముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి మఠాధిపతి సుబుదేంద్ర తీర్థస్వామి ఆశీస్సులతో.. చానళ్లు ప్రారంభించారు. శ్రీవారి ఆలయం ఎడమవైపున అధునాతన సాంకేతికతో నిర్మించిన బూందీ తయారీ పోటును ప్రారంభించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో తితిదే చేపట్టిన నూతన కార్యక్రమాల గురించి....అధికారులు వివరించారు.
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో నిన్న పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. ఇవాళ మరోసారి శ్రీవారిని దర్శించుకుని.. ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటలకు ఆలయానికి చేరుకున్న సీఎం.. శ్రీవారి సన్నిధిలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం.. తులాభారం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానంగా.. స్వామివారికి 78 కిలోల బియ్యం సమర్పించారు. తర్వాత.. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహార్ రెడ్డి.. తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: Tirumala Garuda Seva: కన్నుల పండువగా శ్రీవారి గరుడ వాహన సేవ