హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ వాదనలకు సిద్ధం కావాలని కోర్టు ఆదేశించింది. అభియోగాల నమోదుపై వాదించాలని జగన్, విజయసాయికి ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ ఛార్జ్‌షీట్లపై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది. ఈడీ కేసులు మొదట విచారణ జరపడంపై తీర్పు రిజర్వ్‌లో ఉందని విజయసాయి తెలిపారు. హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందని విజయసాయిరెడ్డి కోర్టుకు తెలిపారు. ఎమ్మార్ అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఆగస్టు 4కు వాయిదా పడింది.
ఇదీ చదవండి: