ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సన్మానించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని ఆమె నివాసానికి వెళ్లిన జగన్.. సీతామహాలక్ష్మిని ఘనంగా సత్కరించారు.
జాతీయ పతాకం రూపొందించి ఈ ఏడాది మార్చి 31కి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఆమెకు సన్మానం చేశారు. సీతామహాలక్ష్మిని సీఎం జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను జగన్ తిలకించారు.
ఇదీ చదవండి: జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. పీఆర్సీ ఎలా ఇస్తుంది.?: బండి సంజయ్