ETV Bharat / city

ఎంపీ విజయసాయిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించిన జగన్​ - వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

MP Vijayasaireddy: ఏపీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరిన్ని బాధ్యతలు అప్పగించారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో పాటు అదనంగా మరిన్ని బాధ్యతలను అప్పగించారు.

ఎంపీ విజయసాయిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించిన జగన్​

author img

By

Published : Apr 27, 2022, 3:48 PM IST

ఏపీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ.. ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయం బాధ్యతలకు అదనంగా.. మరిన్ని బాధ్యతలు ఇచ్చారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుల సమన్వయ బాధ్యతలనూ సాయిరెడ్డికి అప్పగించారు. ఈ నెల 19న పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లను సీఎం నియమించారు. విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారనే విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే పునః సమీక్షించిన సీఎం.. సాయిరెడ్డికి బాధ్యతలు పెంచాలని నిర్ణయించారు. ఈ నెల 19న జారీ చేసిన నియామక ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యేలు, మీడియా కో-ఆర్డినేషన్ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం అప్పగించారు.

ఇవీ చదవండి..

Harish Rao Speech In Plenary: 'మా నినాదం సంపద పెంచాలి... పేదలకు పంచాలి'

Avatar 2 movie: 160 భాషల్లో 'అవతార్-2'.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.