ETV Bharat / city

CM JAGAN: '26 నెలలుగా ప్రజారంజకమైన పాలన' - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ జెండా ఎగురవేశారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. లోపాలు సరిదిద్దుకొని కొత్త బాటలు వేసుకొనేందుకు ఇది సరైన సందర్భమని జగన్​ అన్నారు.

cm-jagan-flag-hosting-in-andhra-pradesh
cm-jagan-flag-hosting-in-andhra-pradesh
author img

By

Published : Aug 15, 2021, 12:38 PM IST

ఏపీలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్​ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

లోపాలు సరిదిద్దుకుని కొత్త బాటలు వేసుకొనేందుకు ఇది సరైన సందర్భమని జగన్​ అన్నారు. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అనేవి అందరికీ సమానంగా అందాలని.. హక్కులు, వాటి అమలు మధ్య ఉన్న తేడా రూపుమాపాలని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాదయాత్రలో చూశానన్నారు. తమకు మరింత బలం కావాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు.

మహిళలు రాజకీయంగా మరింత సాధికారిత సాధించాలని సీఎం ఆకాంక్షించారు. 26 నెలలుగా ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో బతికేందుకు సొంతిల్లు ఉండాలని సీఎం అన్నారు. వ్యవసాయ రంగంలో రూ.83 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని.. ఇప్పటివరకు రూ.17 వేల కోట్లు అందించామని పేర్కొన్నారు. ఆర్‌బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.

అంతకుముందు పలు ప్రభుత్వ విభాగాలు సంక్షేమ పథకాలను వివరిస్తూ తయారు చేసిన శకటాలను సీఎం జగన్ పరిశీలించారు. వీటిలో దిశ యాప్, రైతు భరోసా, పోలవరం ప్రాజెక్టు, మహిళా అభివృద్ది శిశుసంక్షేమం, పాఠశాల విద్యాశాఖ రూపొందించిన అమ్మఒడి, మన బడి నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ, కరోనా నివారణ, గృహనిర్మాణ శాఖ రూపొెదించిన పేదలందరికీ ఇళ్లు శకటాలున్నాయి.

ఇదీ చదవండి:

CM KCR Speech: అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.