ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీకి ఇంటర్నెట్ ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు(digital libraries in andhra pradesh news). ఈ సేవల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై సమీక్షించిన ఏపీ ముఖ్యమంత్రి.. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు(cm jagan review on digital library and internet services news). అనంతపురం, చిత్తూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలపై దృష్టిపెట్టాలన్నారు. వర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని అభిప్రాయపడ్డారు.
యువతకు ఉపయోగపడాలి..
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఇంటర్నెట్ సేవలు ఉపయోగపడాలని సీఎం జగన్ (cm jagan on internet services news) సూచించారు. విలేజ్ డిజిటల్ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. లైబ్రరీల నిర్వహణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జనవరి నాటికి తొలిదశలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తిచేస్తామని అధికారులు.. ముఖ్యమంత్రికి వివరించారు. ఉగాది నాటికి ఫేజ్-1లో కంప్యూటర్ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్ లైబ్రరీలు వస్తాయని వివరించారు. డిసెంబర్ 2022 నాటికి ఫేజ్ 2 పూర్తిచేసేలా కార్యాచరణ చేయాలని సీఎం ఆదేశించారు. జూన్ 2023 నాటికి మూడో దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు.
'ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీకి ఇంటర్నెట్ ఇవ్వాలి. వర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉపయోగపడాలి. విలేజ్ డిజిటల్ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలి. లైబ్రరీల నిర్వహణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డిసెంబర్ 2022 నాటికి ఫేజ్ 2 పూర్తిచేసేలా కార్యాచరణ చేయాలని. జూన్ 2023 నాటికి మూడో దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ లక్ష్యంగా నిర్దేశించుకోవాలి'
- ఏపీ ముఖ్యమంత్రి జగన్
ఇదీచూడండి: Governor Tamilisai: ఇంటర్నెట్ లేని జీవితాలు ఊహించలేం