ETV Bharat / city

Night Curfew Lifted in AP: ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం - రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత

Night Curfew Lifted in AP: ఏపీలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు తగ్గడం వల్ల రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసినట్లు ప్రకటించిన సీఎం జగన్​.. ప్రజలంతా కొవిడ్​ మార్గదర్శకాలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Night Curfew Lifted
ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
author img

By

Published : Feb 14, 2022, 7:52 PM IST

Night Curfew Lifted in AP: ఆంధ్రప్రదేశ్​లో రాత్రి కర్ఫ్యూను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గినందున కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కర్ఫ్యూ తొలగించినా.. కొవిడ్ బారిన పడకుండా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రజలంతా మాస్క్‌లు ధరించేలా చూడాలని ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

రిక్రూట్​మెంట్​ పూర్తి చేయాలి..

ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్న సీఎం.. లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్నారు. వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపైనా సమీక్షించిన సీఎం.. ఆ శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేరు చేయాలని సీఎం ఆదేశించారు. నిపుణులైన వారికి పరిపాలనా బాధ్యతలను అప్పగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించగా.. వీటిపై మార్గదర్శకాలు తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వారికి ప్రోత్సహకాలు ఇవ్వాలి..

"మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలి. వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి. ఫీవర్‌ సర్వే కొనసాగించాలి. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయించాలి. వైద్యారోగ్యశాఖలో నియామకాలు త్వరగా పూర్తి చేసి సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలి. ఆస్పత్రుల్లో చికిత్స, పాలన బాధ్యతలు వేర్వేరు చేయాలి. నిపుణులకు పాలనా బాధ్యతలు అప్పగించాలి. గిరిజన ప్రాంతాల్లో చేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి."

-జగన్, ఏపీ ముఖ్యమంత్రి

ఇదీ చదవండి: Statue of Equality: అవే రామానుజ సహస్రాబ్ది వేడుకలకు వన్నె తెచ్చాయి: చినజీయర్​ స్వామి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.