ETV Bharat / city

ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం

author img

By

Published : Oct 19, 2020, 3:45 PM IST

Updated : Oct 19, 2020, 5:11 PM IST

ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం
ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం

15:41 October 19

భాగ్యనగరంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు వరదలపై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు..

వరదల కారణంగా హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంత ప్రజలు ఎన్నో అష్టకష్టాలకు గురయ్యారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అన్నారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద ప్రభావానికి గురైన వారికి ఇచ్చే ఆర్థిక సాయానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లు బృందాలు ఏర్పడాలని, అందరికీ సాయం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి పరిహారంగా లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50వేలు చొప్పున అందిస్తామన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. పేదలకు సాయం కోసం పురపాలక శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 

 రాష్ట్రానికి రూ.10కోట్లు విరాళం..

వరదల నేపథ్యంలో తమిళనాడు సీఎం.. రాష్ట్రానికి రూ.10కోట్లు విరాళం, ఇతరత్రా సామగ్రి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామికి సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కూడా ఇలాంటి కష్ట సమయంలో తమవంతు సాయం అందించాలని విజ్ఞప్తిచేశారు. సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు.

ఇవీ చూడండి: మళ్లీ వరుణ ప్రతాపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశం

Last Updated : Oct 19, 2020, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.