ETV Bharat / city

రాష్ట్ర ప్రజలపై మరింత భారం పడనుంది: భట్టి - ఎఫ్​ఆర్​ఎంబీ చట్టంపై భట్టి విక్రమార్క ఆందోళన

రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన ఎఫ్​ఆర్​బీఎం చట్టంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమర్క మండిపడ్డారు. 3 నుంచి 5 శాతానికి పెంచడం వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

clp leader mallu bhatti vikramarka fire on frmb act in telanagana
రాష్ట్ర ప్రజలపై మరింత భారం పడనుంది: భట్టి
author img

By

Published : Sep 14, 2020, 6:04 PM IST

ప్రభుత్వం 3నుంచి 5 శాతానికి ఎఫ్​ఆర్​బీఎం పెంచడం వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న అప్పులకు ఈ అప్పులు కలిపి... 2020 వరకు రూ. 5లక్షల 87వేల 536 కోట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పు, వడ్డీ కలిపి రూ. 23 వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. భవిషత్తులో రాష్ట్ర ప్రజలపై భారం పడుతుందని... ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విశ్వద్యాలయాలను పటిష్ఠం చేయాలని, నియామకాలు చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. 2014 నుంచి వీసీల నియామకం చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం అనుమతించిన 5 ప్రైవేటు యూనివర్సిటిల్లో తెరాసకు చెందిన వ్యక్తలవే 3 ఉన్నాయని పేర్కొన్నారు.

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే సమస్య పరిష్కారం కాదని... భూ సర్వే చేసిన తర్వాతే నమోదు చేయాలని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి సూచించారు. ల్యాండ్ రికార్డ్ మానిటరైజేషన్​కు యూపీఏ, ఎన్డీఏ హయాంలో నిధులు వచ్చినా... రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే భూముల సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు. సంఖ్యాబలంతో ఏకపక్షంగా బిల్లులు ఆమోదించుకుంటున్నారని ఆరోపించారు. 77 వేల ఎకరాల వక్ఫ్ భూముల్లో 54 వేల ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పిన కేసీఆర్... ఏడేళ్ల నుంచి ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 8 బిల్లులకు శాసనసభ ఆమోదం... రేపటికి వాయిదా

For All Latest Updates

TAGGED:

BHATTI
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.