ETV Bharat / city

సలహాలిచ్చిన గవర్నర్​పైనా విమర్శలు చేస్తారా..: భట్టి

గవర్నర్​, కాంగ్రెస్​ చేసిన సూచనలను భేఖాతరు చేయడం వల్లనే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై గవర్నర్​ మాట్లాడడం అభినందనీయమన్నారు.

bhatti vikramarka
సలహాలిచ్చిన గవర్నర్​పైనా విమర్శలు చేస్తారా..: భట్టి
author img

By

Published : Aug 19, 2020, 5:02 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి.. గవర్నర్​ సూచనలు చేస్తే.. దానిపైన విమర్శలు చేయడం సరికాదన్నారు. గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు వెంటనే క్షమాపణలు చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. కేసీఆర్​ తన పదవికి రాజీనామా చేయాలన్నారు.

ప్రజల ఆరోగ్యం కోసం గవర్నర్​ మాట్లాడడం అభినందనీయమని భట్టి అన్నారు. గవర్నర్ తన వ్యాఖ్యలను మాటలకే పరిమితం చేయకుండా.. ఆచరణలో పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని భట్టి కోరారు. గవర్నర్ సూచనలను తెరాస ప్రభుత్వం బేఖాతరు చేయడం వల్లే రాష్ట్రమంతా కరోనా విజృంభిస్తోందన్నారు.

రేషన్ తరహాలో కరోనా బారినపడిన బీపీఎల్‌ కుటుంబాలకు ఉచిత చికిత్స అందించాలని డిమాండ్​ చేశారు. కరోనా తీవ్రతను ముందే పసిగట్టి.. కాంగ్రెస్ తరఫున పలుమార్లు లేఖలు రాసినట్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

సలహాలిచ్చిన గవర్నర్​పైనా విమర్శలు చేస్తారా..: భట్టి

ఇవీచూడండి: 'సీఎంకు కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ... పాలమూరుపై ఎందుకు లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.