ETV Bharat / city

Bhatti Comments: 'కేసీఆర్, మోదీ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవీ..' - congress leaders response on modi comments

Bhatti Comments: కాంగ్రెస్​పై, విభజన తీరుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌, సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని విరుచుకుపడ్డారు. కేసీఆర్​, మోదీ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

CLP leader bhatti vikramarka Comments on modi and KCR

author img

By

Published : Feb 9, 2022, 3:30 PM IST

కేసీఆర్, మోదీ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవీ..

Bhatti Comments: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌, సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన గురించిన ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించట్లేదని భట్టి నిలదీశారు. కేసీఆర్​, మోదీ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బిల్లు ఆమోదం ప్రక్రియలు మోదీకి తెలియవా..? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆలస్యం వల్లే విద్యార్థులు చనిపోయారనటాన్ని భట్టి తీవ్రంగా తప్పుబట్టారు.

కేసీఆర్​ ఎందుకు స్పందించట్లేదు..?

"బిల్లు ఆమోదం ప్రక్రియలు మోదీకి తెలియవా..? బిల్లుపై ఓటింగ్‌ సమయంలో తలుపులు మూయటం ఎప్పుడూ జరిగేదే. కాంగ్రెస్‌ ఆలస్యం వల్ల విద్యార్థులు చనిపోయారనటం సరికాదు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌ జరుగుతుంటే కేసీఆర్‌ సభలోనే లేరు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌కు కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. సభలో బలం లేనప్పుడు కీలక బిల్లులు పెట్టకూడదు. అందరినీ ఒప్పించేందుకు కాంగ్రెస్​కు కొంత సమయం పట్టింది. ప్రధాని వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించట్లేదు. కేసీఆర్, మోదీ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవీ." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

తెలిసి కూడా తెలంగాణ ఇచ్చారు..

ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కూడా స్పందించారు. సీమాంధ్రలో పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని జీవన్​రెడ్డి తెలిపారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడటం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. విభజనచట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.