ETV Bharat / city

Bhatti : నేను చాలా అడిగా... వాళ్లకు కావల్సినట్లు ప్రెస్​ నోట్ ఇచ్చారు: భట్టి

author img

By

Published : Sep 14, 2021, 7:45 PM IST

దళిత బంధుపై సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం నిర్వహించి సన్నాహాక​ సమావేశంలో చాలా అంశాల గురించి స్పష్టత అడిగినట్లు సీఎల్పీ నేత భట్టి (CLP leader Bhatti Vikramarka) తెలిపారు. కానీ వారికి కావాల్సిన రీతిలో మలుచుకున్నారని ఆరోపించారు. దళిత బంధు లాంటి పథకాన్ని గిరిజనులకూ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను కోరినట్లు తెలిపారు. ఇతర కులాల్లోని పేదల కోసం ఇదే తరహా పథకాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

clp leader bhatti
clp leader bhatti

దళితబంధు లాంటి పథకాన్ని గిరిజనులకూ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను కోరినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP leader Bhatti Vikramarka) తెలిపారు. ఇతర కులాల్లోని పేదల కోసం ఇదే తరహా పథకాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. దళితబంధు పథకం లబ్ధిదారులు ఒకటికి మించి ఎక్కువ వ్యాపారాలు చేసుకోవచ్చో లేదో స్పష్టత ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. చాలా అంశాలపై స్పష్టత ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు. కానీ వారికి కావాల్సిన రీతిలో మలుచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని దళిత కుటుంబాలకు పథకం అమలు చేయాలని చెప్పినట్లు వెల్లడించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారని... వారిని కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. నాలుగు మండలాలకు పరిమితం కాకుండా.. ఏఏ సంవత్సరం ఎన్ని వేల కోట్లు కేటాయిస్తున్నారో చెప్పాలని అడిగినట్లు భట్టి వివరించారు.

వారికి నచ్చినట్లుగా ప్రెస్​నోట్​ ఇచ్చారు

'గిరిజన బంధు, వెనుకబడిన వారిని కూడా ఆదుకోవాలని సీఎంను కోరాం. 10 లక్షలు ఒకే వ్యాపారం కోసమే వాడుకోవాలా.. రెండుమూడు రకాల వ్యాపారాల కోసం వాడుకోవచ్చా అని అడిగా. దళిత బంధు నామ్ కే వాస్తు పథకంగా మారొద్దు అని చెప్పా. సీఎంవో ప్రెస్ నోట్.. వారికి నచ్చినట్టుగా రాసుకొని విడుదల చేశారు. దళిత బంధు పూర్తిగా అమలు చేయాలంటే.. లక్షా 70 వేల కోట్లు కావాలి. ఇది ఎలా చేస్తారో చెప్పాలని కేసీఆర్​ను కోరా.'

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి

వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో దళిత బంధు అమలు చేస్తే.. ఆగ్రోస్, పాడి పరిశ్రమకు ప్రాధానత్య ఇవ్వాలని సీఎంను కోరినట్లు భట్టి తెలిపారు. దీనిద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచడానికి వీలుంటుందని చెప్పినట్లు వివరించారు. హైదరాబాద్‌ పంజాగుట్ట కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు పోరాడుతున్నారని... వీహెచ్​ డిమాండ్‌ మేరకు విగ్రహం ఏర్పాటు చేయాలని కేసీఆర్​కు విజ్ఞప్తి చేసినట్లు భట్టి వెల్లడించారు. తాము అడిగిన అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు.

అలా అంటే ఎలా?

రెండు జీవనదులపై ఉన్న ప్రాజెక్టులపై, ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా.. లక్షల ఎకరాల్లో సాగవుతోందని సీఎం అన్నారని భట్టి (CLP leader Bhatti Vikramarka) తెలిపారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరే అంటే ఎలా అని ప్రశ్నించారు. మార్కెటింగ్ చేయాలి కానీ రైతులను భయపెట్టవద్దని హితవు పలికారు. కొన్ని రాష్ట్రాలకు ఉన్న వనరులను మార్కెటింగ్ చేసుకొని లబ్ధిపొందాలని సూచించారు. దిల్లీలో ఉన్న ఓ పెద్దాయన అన్నాడని చెప్పడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇలా మాట్లాడలేదని.. కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీఎంవో ప్రకటనలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దానిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

నేను చాలా అడిగా... వాళ్లకు కావల్సినట్లు ప్రెస్​ నోట్ ఇచ్చారు : భట్టి

ఇదీ చదవండి : CM KCR REVIEW: 'వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.