ETV Bharat / city

'మొత్తం పరిశీలన పూర్తయ్యాకే సంతృప్తి చెందానా లేదా చెప్తా...'

author img

By

Published : Sep 17, 2020, 4:58 PM IST

జీహెచ్​ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్​బెడ్​రూం ఇళ్ల పరిశీలనలో భాగంగా నేడు 3 వేల 428 గృహాలను చూసినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. లక్ష ఇండ్లను చూసే వరకు పరిశీలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

'మొత్తం పరిశీలన పూర్తయ్యాకే సంతృప్తి చెందానా లేదా చెప్తా...'
'మొత్తం పరిశీలన పూర్తయ్యాకే సంతృప్తి చెందానా లేదా చెప్తా...'

'మొత్తం పరిశీలన పూర్తయ్యాకే సంతృప్తి చెందానా లేదా చెప్తా...'

హైదరాబాద్​లో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పరిశీలన పూర్తయ్యాకే... తాను సంతృప్తి చెందానా లేదా అనేది చెప్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2లక్షల 68వేల ఇండ్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం లక్ష ఇండ్లు రెడీగా ఉన్నట్లు వెల్లడించిందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి గ్రేటర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించామన్నారు.

జియాగుడా నుంచి వెస్ట్​మారేడ్​పల్లి వరకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. ఇవాళ 3వేల 4వందల 28 ఇండ్లను చూశామని.... లక్ష ఇండ్లను చూసే వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలిస్తామన్నారు. నాణ్యతాపరంగా ఇంజినీరింగ్ బృందం పరిశీలన చేస్తోందని... ఆ నివేదిక వచ్చిన తరువాత మాట్లాడుతానని భట్టి తెలిపారు.

ఇదీ చూడండి: 'భట్టిని వెంటబెట్టుకుని లక్ష డబుల్ బెడ్​రూం ఇళ్లు చూపిస్తా...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.