ETV Bharat / city

'భారీ బడ్జెట్‌ అంచనాలతో ఫలితాలు రాక పేదలు నష్టపోతారు' - clp bhatti vikramarka about budget 2022

CLP Bhatti on Budget 2022 : శాసనసభ చివరి రోజు సమావేశాల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చి జరిగింది. ఈ చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పలు ప్రశ్నలు అడిగారు. బడ్జెట్ భారీగా పెంచుకునేందుకు లెక్కలు ఉపయోగపడతాయి కానీ.. పెంచిన బడ్జెట్‌తో లక్ష్యాలు సాధించలేమని అన్నారు. విభజన చట్టం హామీల కొరక రాష్ట్ర సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. రాని ఆదాయాన్ని పెద్దమొత్తంలో పద్దులో చూపుతున్నారని మండిపడ్డారు.

CLP Bhatti on Budget 2022
CLP Bhatti on Budget 2022
author img

By

Published : Mar 15, 2022, 3:10 PM IST

CLP Bhatti on Budget 2022 : శాసనసభ బడ్జెట్ సమావేశాలు 2022-23 చివరి రోజున ద్రవ్యవినిమియ బిల్లుపై జరిగిన చర్చలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మాట్లాడారు. 2021-22 నాటికి రూ.6వేల కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వస్తే.. రూ.30వేల కోట్లు వచ్చినట్లు చూపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సవరించిన అంచనాల్లో రూ.20వేల కోట్లుగా చూపారని.. ఈ ఏడాది పన్నేతర ఆదాయాన్ని రూ.25,421 కోట్లుగా చూపినట్లు తెలిపారు. రాని ఆదాయాన్ని పెద్దమొత్తంలో బడ్జెట్‌లో చూపుతున్నారని భట్టి మండిపడ్డారు. పద్దు భారీగా పెంచుకునేందుకు లెక్కలు ఉపయోగపడతాయి కానీ.. పెంచిన బడ్జెట్‌తో లక్ష్యాలు సాధించలేమని గుర్తించాలని అన్నారు.

Telangana Budget Sessions 2022 : "సహాయక గ్రాంట్లు రూ.41 వేల కోట్లుగా చూపారు. కేంద్రం నుంచి సహాయక గ్రాంట్లు గరిష్ఠంగా రూ.15 వేల కోట్లు వస్తాయి. పన్ను ఆదాయాల్లోనూ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. 2021-22లో పన్ను ఆదాయాన్ని రూ.1.76 లక్షల కోట్లుగా చూపారు. సవరించిన పన్ను ఆదాయం రూ.1.56 లక్షల కోట్లుగా చూపారు. వాస్తవానికి పన్ను ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు దాటదని భావిస్తున్నాను. పన్ను, పన్నేతర ఆదాయాలు, సహాయక గ్రాంట్లను భారీగా చూపించారు."

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Bhatti Comments on Budget 2022 : బడ్జెట్‌లో రూ.60 వేల కోట్ల వరకు వ్యత్యాసం కనబడుతోందని భట్టి విక్రమార్క అన్నారు. భారీ బడ్జెట్‌ అంచనాలతో ఆశించిన ఫలితాలు రాక పేదలు నష్టపోతారని తెలిపారు. రైతుబంధుతో పాటు గతంలో ఉన్న పథకాలు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నిలిపివేసిన పావలా వడ్డీ రుణాలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

"విభజన చట్టం హామీలు ఇప్పటికీ అమలు కావట్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన వాటా 8 ఏళ్లుగా రావటం లేదు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, స్టీల్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుకోలేదు. తెలంగాణపై కేంద్ర వివక్ష ఆందోళనకరంగా ఉంది. దేశంలో 171 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుంటే రాష్ట్ర సర్కార్ ఏం చేస్తోంది."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.