ETV Bharat / city

క్లౌడ్ టైలర్.. ఇచట అన్ని రకాల డిజైనర్ వస్త్రాలు లభించును

author img

By

Published : Mar 8, 2022, 10:09 AM IST

Cloud Tailor App : ప్రతిష్ఠాత్మక బిట్స్‌ పిలానిలో ఎంఎస్.. ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ.. విప్రో, డెల్, క్వాంటమ్ వంటి సంస్థల్లో ఉద్యోగం. ఇవేమీ ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. ఏదో కొత్తగా చేయాలన్న తపన.. ఆమెను వ్యాపారం వైపు అడుగులు పడేలా చేసింది. తన అనుభవాలనే పాఠాలుగా మార్చుకుంటూ.. సమస్యలకు పరిష్కారం వెతుకుతూ.. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ఆటుపోట్లను అధిగమిస్తూ అద్భుత విజయం సాధించింది హైదరాబాద్‌కు చెందిన సుస్మిత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని.. సాఫ్ట్‌వేర్‌ వదిలి టైలరింగ్‌లో రాణిస్తున్న సుస్మిత విజయగాథను తెలుసుకుందాం.

Cloud Tailor App
Cloud Tailor App
క్లౌడ్ టైలర్

Cloud Tailor App : అందమైన వస్త్రాలు ధరించి నలుగురిలో భిన్నంగా కనిపించాలనే ఆకాంక్ష.. సాధారణంగా అందరి ఆడవాళ్లలో ఉంటుంది. రెడిమేడ్‌ దుస్తులు కొనుగోలు చేసినా.. ఏదో కొత్త డిజైన్‌ ఉంటే బాగుండు అని కొందరు అనుకుంటారు. వేలు ఖర్చుపెట్టి డిజైనర్ల దగ్గర వస్త్రాలు డిజైన్‌ చేయించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. అలాంటివారి మనోభావాలకు అనుగుణంగా.. తక్కువ ఖర్చుతో ఆన్‌లైన్ వేదికగా డిజైనర్ దుస్తులు అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు హైదరాబాద్‌కు చెందిన సుస్మిత లక్కాకుల. క్లౌడ్ టైలర్ అంటూ టైలరింగ్ పనికి సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానాన్ని జోడించి మంచి విజయాలు అందుకుంటున్నారు.

క్లౌడ్ టైలర్..

Cloud Tailor Hyderabad : హైదరాబాద్‌ నగరానికి చెందిన సుస్మిత.. బిట్స్‌పిలానిలో ఎంఎస్ చేశారు. ఆ తర్వాత ఐఐఎం కోల్‌కతా నుంచి ఎంబీఏ చేసి.. విప్రో, డెల్, క్వాంటమ్ సంస్థల్లో సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్‌గా పనిచేశారు. సుస్మితకు ఓ కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. మొదటి నుంచి అందరికంటే భిన్నమైన వస్త్రాలు ధరించాలనుకునే సుస్మిత.. రెడీమేడ్ వస్త్రాలను పెద్దగా ఇష్టపడేవారు కాదు. స్వయంగా నచ్చిన డిజైన్లతో డ్రెస్‌లు కుట్టించుకునేవారు. 2020లో కొవిడ్‌ కారణంగా టెయిలర్స్‌ అందుబాటులో లేకపోవడం, పాప పుట్టిన తర్వాత దుస్తులు బిగుతుగా మారి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే తనలాంటి వారికి ఆన్‌లైన్‌ వేదికగా వస్త్రాలు అందించాలనే ఆలోచన సుస్మితకు తట్టింది. టైలరింగ్ రంగంలో తనదైన ముద్ర వేయాలని భావించి.. క్లౌడ్ టైలర్ పేరుతో ఆన్‌లైన్‌లో వేదికగా 2020లో బొటిక్‌ ప్రారంభించారు.

క్లౌడ్ టైలర్ నిర్వహణకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు. సాఫ్ట్‌వేర్‌ కొలువుకు స్వస్తి చెప్పిన సుస్మిత.. వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే సుమారు 16వేల మంది వినియోగదారులను సంపాదించుకున్నారు.

లక్షల్లో వ్యాపారం..

Cloud Tailor Susmitha Lakkakula : క్లౌడ్‌ టెయిలర్‌ యాప్‌లో అన్ని రకాల డిజైన్లను పొందుపరచడంతోపాటు.. వినియోగదారులకు ఏదైనా అదనంగా కావాలనుకుంటే ఆ వివరాలు జోడించే అవకాశం కల్పించారు. ఒకసారి యాప్‌లో వివరాలు నింపిన తర్వాత.. నేరుగా డిజైనర్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వారి ఇళ్లల్లోకి వెళ్లి కొలతలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న వారికి వీడియో కాల్‌ ద్వారా కొలతలు తీసుకుంటారు. శరీర ఆకృతిని బట్టి దుస్తులను ఎంపిక చేసుకునేందుకు వీలుగా.. త్రీడీ డిజైనింగ్‌ని యాప్‌లో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం యాప్ అభివృద్ధి, టెయిలరింగ్, డిజైనర్లు కలిపి దాదాపు 45 మందికి సుస్మిత ఉపాధి కల్పిస్తున్నారు. 2020లో తక్కువ పెట్టుబడితో క్లౌడ్ టెయిలర్‌ను ప్రారంభించిన సుస్మిత.. లక్షల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

ఏడున్నర కోట్ల పెట్టుబడులు..

హైదరాబాద్‌లో దిగ్విజయంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సుస్మిత.. త్వరలో దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, పూణె వంటి నగరాల్లో కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 35 నాట్ వెంచర్స్ వంటి సంస్థల నుంచి ఏడున్నర కోట్ల పెట్టుబడులను సాధించి.. తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.