Clashes In YSRCP: ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈనెల 16న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు కావడం వల్ల ప్రొద్దుటూరులో ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వాటిలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫోటో లేకపోవడంతో గొడవకు దారితీసింది.
ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి వర్గీయులు.. సదరు ఫ్లెక్సీలను చింపేశారు. శ్రీరాములపేట ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదని పదో వార్డు వైకాపా కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మిదేవి, ఆయన భర్త, కుమారుడితో పాటు వైకాపా నాయకుడు కసిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ వర్గీయుడు రఘునాథ్‌పై దాడిచేశారు. దీనిపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
ఇదీచూడండి: Cock Fight : జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు