Clash at Abid Police Station: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఎంజే మార్కెట్ వద్ద గణేశ్ నిమజ్జనం వేదికపై ప్రసంగిస్తూ తెలంగాణలో ఒకే కుటుంబానికి మంచి జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. తెలంగాణ రజాకార్ల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై తెరాస కార్యకర్తలు మండిపడ్డారు.
దీంతో అక్కడున్న తెరాస, భాజపా శ్రేణుల మధ్య కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు తెరాస కార్యకర్తలు, నాయకుడు నంద బిలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతని అరెస్ట్ పట్ల ఎంజే మార్కెట్ వద్ద తెరాస కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భాజపా, తెరాస శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని అబిద్ పోలీసు స్టేషన్‌లో తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన తెరాస నాయకుడు నందు బిలాల్‌ను పోలీసులు అడ్డుకోవడంతో తెరాస నాయకులు వాగ్వాదానికి దిగారు. మేము ఏ తప్పు చేయలేదని ఎందుకు అరెస్ట్ చేశారని అబిడ్స్ పోలీసులపై బిలాల్ గొడవకు దిగారు. మా రాష్ట్రానికే వచ్చి మా ముఖ్యమంత్రినే తిడితే ఊరుకోమన్నారు. చివరకు బిలాల్‌ను పోలీసులు నేరుగా ఇంటికి పంపించడంతో సమస్యకు పరిష్కారం దొరికింది.
ఇవీచదవండి: