ETV Bharat / city

పాలమూరుపై పిటిషన్‌ వేరే ధర్మాసనానికి బదిలీ - పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై తాజా వార్తలు

Palamuru Rangareddy Lift Irrigation Scheme పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేసి విచారణ జాబితాలో చేర్చాలని సీజేఐ రిజిస్ట్రీని ఆదేశాలు జారీ చేశారు.

Palamuru Rangareddy Lift Irrigation Scheme
జస్టిస్​ ఎన్వీ రమణ
author img

By

Published : Aug 23, 2022, 8:07 AM IST

Palamuru Rangareddy Lift Irrigation Scheme : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అవకతవకలు జరిగాయంటూ నాగం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుటకు ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. దీన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేసి విచారణ జాబితాలో చేర్చాలని సీజేఐ రిజిస్ట్రీని ఆదేశించారు.

ఇవీ చదవండి.. Plantation సరికొత్త ఆలోచనలతో మొక్కల పెంపకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.