ETV Bharat / city

KATHI MAHESH: తుదిశ్వాస విడిచిన కత్తి మహేష్​

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు కత్తి మహేశ్‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కత్తిమహేశ్‌ దర్శకుడు, నటుడు మాత్రమే కాదు.. పలు టెలివిజన్‌ ఛానళ్లు, యూట్యూబ్‌ వేదికగా సినిమాలను విశ్లేషించేవారు.

కత్తి మహేష్​
actor kathi mahesh
author img

By

Published : Jul 10, 2021, 7:05 PM IST

కత్తి మహేశ్‌ సినీ ప్రస్థానం:

కత్తిమహేశ్‌ కుమార్‌ చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. సినీ దర్శకుడు అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘ఊరు చివర ఇల్లు’ కథ ఆధారంగా ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు. ‘మిణుగురులు’ చిత్రానికి సహ రచయితగా వ్యవహరించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పెసరట్టు’ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నటుడిగా మారారు.

‘హృదయకాలేయం'లో పోలీస్‌ ఆఫీసర్‌గా, 'నేనే రాజు నేనే మంత్రి'లో టీ అమ్మే వ్యక్తిగా, ‘కొబ్బరిమట్ట’లో రైతుగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘క్రాక్‌’ తదితర చిత్రాల్లోనూ మెరిశారు. ప్రముఖ టెలివిజన్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-1లో 27రోజుల పాటు కొనసాగారు. కత్తిమహేశ్‌ దర్శకుడు, నటుడు మాత్రమే కాదు, సినీ విశ్లేషకుడు కూడా. పలు టెలివిజన్‌ ఛానళ్లు, యూట్యూబ్‌ వేదికగా సినిమాలను విశ్లేషించేవారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: Covaxin: 'కొవాగ్జిన్‌'పై 4-6 వారాల్లో నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.