సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఏపీ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేశ్ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
![ఐసీయూలో కత్తి మహేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12270798_dfs.jpg)
ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా... తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎడమ కంటికి తీవ్రగాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన స్నేహితులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: KCR Review: జులై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు