ఏపీలోని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై ఆ రాష్ట్ర సీఐడీ ప్రకటన విడుదల చేసింది. సీఐడీ అదనపు డీజీపీ సునీల్‌కుమార్ తరఫున ప్రకటన విడుదలైంది. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎంపీ రఘురామపై అభియోగం నమోదు చేసినట్టు సీఐడీ పేర్కొంది.
సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని ఎంపీపై అభియోగం నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చారని రఘురామపై అభియోగం మోపారు. ఎంపీ రఘురామపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని సీఐడీ వెల్లడించింది.