ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన విజయలక్ష్మి భర్తతో కలిసి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వృద్ధులకు దుస్తులు, పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసేవారు. కొన్ని అభినందన కార్యక్రమాల్లో పూల మాలలు, బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు. అవన్నీ వృథాగా పోతున్నాయని గుర్తించిన ఆమె.. వీటికి బదులుగా వినూత్నంగా చాక్లెట్ బొకేలకు శ్రీకారం చుట్టారు.
డ్రైప్రూట్స్, చాక్లెట్‌తో బొకేల తయారీ
విజయలక్ష్మి తీపి బొకేల తయారీలో మరింత సృజనాత్మకత జోడించి చిరుధాన్యాలు, బాదం, పిస్తా, జీడిపప్పులతో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. తన అభిరుచికి మరిన్ని మెరుగులు దిద్దేందుకు... యూట్యూబ్ ఛానెల్‌ను ఎంచుకున్నారు. కొన్నిసార్లు ఒకే రోజు 150 ఆర్డర్లు కూడా వచ్చేవి. ఆర్డర్లు ఎక్కువ కావటంతో కొంతమంది మహిళలకు ఉపాధి సైతం కల్పిస్తున్నారు. తనకు వచ్చిన ఆదాయంతోనే సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలనుకుంటున్నారు విజయలక్ష్మి.
ఇదీ చదవండి: 'దేన్నైనా పుట్టించే శక్తి ఆ ఇద్దరిదే.. వారి కోసమే నా యాత్ర'