మద్యపాన నిషేధం పేరిట నాసిరకం బ్రాండ్లు తెచ్చి.. మహిళల మంగళసూత్రాలు తెంచే జగన్‌కు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నిరుపేద మహిళలకు తెలుగుదేశం ఇళ్లు ఇస్తే.. ఓటీఎస్ పేరుతో వారి నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే జగన్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అన్నారు. వివేకా హత్య కేసులో సోదరి సునీతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
"త్వరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నారు. వ్యతిరేకత ఇంకా పెరగవచ్చనే ఉద్దేశంతోనే ఎన్నికల యోచన. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం. నెత్తిమీద కుంపటిని దించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీఎం జగన్.. పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్."
-చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీచూడండి: రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి: సీఎం కేసీఆర్