గాలిపటానికి కట్టిన దారం ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేసిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగింది. నగరంలోని సంగడికుంటకి చెందిన కౌషిక్ అనే మూడేళ్ల చిన్నారి తన తండ్రితో బైక్ పై వెళ్తున్న సమయంలో... గాలిపటం దారం మెడకు చుట్టుకుంది. ఈ ప్రమాదంలో కౌషిక్ మెడకు తీవ్ర గాయమైంది.
హుటాహుటిన బాలుడిని జీజీహెచ్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావటంతో కాసేపటికే బాలుడు మృతి చెందాడు. కౌషిక్ మరణ వార్త విని తల్లి గుండెలవిసేలా రోదించింది. తమ బిడ్డ ఇక లేడన్న విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు