దిల్లీ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ కలిశారు. 2022 సంవత్సరం ఉగాది నాడు విడుదల చేయనున్న చిలకమర్తి వారి శుభకృత్ నామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు చిలకమర్తి ప్రభాకర్ శర్మ అందజేశారు.
ఆంగ్ల పంచాంగాన్ని రంచించిన చిలకమర్తి..
ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆస్థానం పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 2022 ఆంగ్ల పంచాంగాన్ని రచించిన విషయం తెలిసిందే.. దానిని కొన్ని రోజుల క్రితం సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆవిష్కరించారు. ఒక తెలుగు వాడు దేశం మొత్తానికి ఉపయోగపడే పంచాంగాన్ని.. రచించటం గొప్ప విషయమని ములాయం అభినందించారు.
ఇదీ చూడండి: 'యూపీఏ అసమర్థ పాలన.. ఆ బుక్‌తో విస్పష్టం'