ETV Bharat / city

Chennai Drinking Water Committee meeting : నేడు చెన్నై తాగునీటి కమిటీ సమావేశం - చెన్నై తాగునీటి కమిటీ

Chennai Drinking Water Committee meeting : చెన్నై నగరానికి తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల తరలింపు విషయమై నేడు.. చెన్నై తాగునీటి కమిటీ సమావేశం కానుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

CDWC
CDWC
author img

By

Published : Dec 23, 2021, 7:16 AM IST

Chennai Drinking Water Committee meeting : చెన్నై నగరానికి తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల తరలింపు విషయమై నేడు సంబంధిత కమిటీ సమావేశం కానుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Krishna River Management Board : ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల నుంచి ఏటా 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంది. ఏటా జులై నుంచి అక్టోబర్ వరకు 8 టీఎంసీలను ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు వరకు చేర్చాల్సి ఉండగా.. ఈ ఏడాది 5 టీఎంసీలు మాత్రమే వదిలారు. మిగతా నీటి విషయమై సమావేశంలో చర్చిస్తారు. 2021-22 లో తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి చెన్నై అవసరాల కోసం 12 టీఎంసీలు సరఫరా కోసం ఆపరేషన్ రూల్స్‌పై కూడా చర్చించనున్నారు. శ్రీశైలం, కండలేరు నుంచి తమిళనాడుకు పైప్ లైన్లు నిర్మించాలన్న ప్రతిపాదనతోపాటు ఇతర అంశాలపైనా సమావేశంలో చర్చ జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.