ETV Bharat / city

CHEETAH ATTACK IN TIRUMALA: తిరుమల ఘాట్‌ రోడ్డులో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి - తిరుమల ఘాట్‌ రోడ్డులో ఇద్దరిపై చిరుత దాడి

CHEETAH ATTACK IN TIRUMALA: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు చిరుత దాడిలో స్వల్పంగా గాయపడ్డారు.

CHEETAH ATTACK IN TIRUMALA
CHEETAH ATTACK IN TIRUMALA
author img

By

Published : Dec 15, 2021, 9:58 PM IST

CHEETAH ATTACK IN TIRUMALA: తిరుమల ఎగువ కనుమదారిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు నీటి సరఫరా విభాగ ఉద్యోగులపై చిరుత దాడి చేసింది. వినాయక స్వామి ఆలయం దాటిన తరువాత.. మలుపులో చిరుత ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై దూకింది.

ఈ ఘటనలో చిరుత గోళ్లు గీరుకుని ఆనందయ్య, రామకృష్ణలు స్వల్పంగా గాయపడ్డారు. వాహనం ఆపకుండా వేగంగా ముందుకు ప్రయాణించి చిరుత నుంచి తప్పించుకున్నట్లు వారు తెలిపారు. ఘటనపై వారు భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.

తిరుమల ఘాట్ రోడ్డులో కలకలంరేపిన చిరుత సంచారం

ఇదీ చదవండి: TTD YV SUBBA REDDY: ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన తితిదే ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.