ఇటీవల ఇద్దరు మిత్రులు కలసి తమ బంధువులకు ప్రభుత్వం నుంచి ఇళ్లను మంజూరు చేయిస్తానంటూ రూ.30లక్షలు వసూలు చేశారు. ఇళ్ల ఊసేలేకపోవటంతో బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మోసం వెలుగుచూసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఇళ్లను ఇప్పిస్తామంటూ వందలాది మంది నుంచి రూ.2 కోట్ల వరకూ వసూలు చేశారు. మరో ప్రబుద్ధుడు మేడ్చల్, మల్కాజిగిరిలోని బస్తీలను లక్ష్యంగా చేసుకుని 150 మంది నుంచి రూ.40లక్షల వరకూ రాబట్టాడు. ప్రధాన రాజకీయపార్టీకు చెందిన ఓ కార్యకర్త ఇలాగే డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇతడిపై ఫిర్యాదులొచ్చినట్లు తెలిసింది.
తప్పించుకుంటున్న సూత్రధారులు
ఇటీవల బాచుపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఓ ప్రైవేటు ఛానల్ ఛైర్మన్‌గా చెప్పుకొంటూ నకిలీ ఐడీ కార్డుతో ఓ వ్యక్తి అమాయకులకు టోకరా వేశాడు. ఇళ్లు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.1,55,000-1,70,000 వరకూ వసూలు చేశాడు. కొంపల్లికి చెందిన మాయగాడు ఎస్సార్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, మోతీనగర్ తదితర ప్రాంతాల్లోని పేదలకు ఇదే విధంగా వల విసిరాడు. ప్రభుత్వం దసరా పండుగకల్లా ఇళ్లను కేటాయిస్తామంటూ చేసిన ప్రకటనను అవకాశంగా మలచుకున్నాడు. అనుమానం వచ్చిన ఓ బాధితురాలు రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
- ఇదీ చూడండి: సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ