భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధిస్తున్న గిరిజన ఉపాధ్యాయుడు డాక్టర్ బానోత్ రాందాస్‌కు ప్రపంచ రికార్డుల పుస్తకంలో చోటు దక్కింది. ఈయన రాసిన పుస్తకానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (యునైటెడ్ కింగ్‌డమ్)లో స్థానం లభించింది. బుధవారం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. లేటెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్(లైఫ్-2021) పేరిట రాందాస్ రచించిన పుస్తకాన్ని చెన్నైలోని ఈఎస్‌ఎన్ పబ్లికేషన్ సహకారంతో ప్రచురించారు.
ప్రపంచంలోనే అత్యంత లావైన పుస్తకంగా దీన్ని గుర్తించారు. 11,796 పేజీలున్న ఈ పుస్తకం ప్రచురణలో పాలుపంచుకున్నందుకు రాందాస్‌కు ప్రశంసాపత్రం, పతకం, జ్ఞాపికను అందజేశారు. రాందాస్ పలు పరిశోధన పత్రాలు రాశారు. వివిధ రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థపై ఉపన్యాసాలు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, ఎంపీడీవో వివేక్‌రామ్ తదితరులు రాందాస్‌ను అభినందించారు.
ఇదీ చూడండి: నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ రీఓపెన్