భాగ్యనగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను కొంతవరకు తీర్చుతున్న మెట్రో రైలు(Hyderabad Metro) సేవలను ఈనెల 6 నుంచి మరో అరగంట పొడిగించనున్నారు. ఈ మేరకు మెట్రో అధికారులు ప్రకటన జారీ చేశారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకే ఉన్న చివరి మెట్రోరైలు.. పొడిగించిన అరగంటతో.. రాత్రి 10.15 గంటల వరకు ఉండనుంది.
ఎప్పటిమాదిరే ఉదయం 7 గంటల నుంచి మెట్రో సేవలు(Hyderabad Metro) ప్రారంభమవుతాయి. రాత్రి 10.15 గంటలకు ముగుస్తాయి. ప్రతిరోజు మూడు మార్గాల్లో 1,000 ట్రిప్పులను మెట్రో(Hyderabad Metro) తిప్పుతోంది.
మెట్రోతో నగర ప్రజలు ట్రాఫిక్ నుంచి కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉదయం కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు ఎక్కువగా నగర ప్రజలు మెట్రో(Hyderabad Metro) సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేవల పొడిగింపుతో ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.