ETV Bharat / city

'టెలికాలర్స్ ఒత్తిడితోనే చంద్రమోహన్ ఆత్మహత్య' - మేడ్చల్ జిల్లా వార్తలు

టెలికాలర్స్ ఒత్తిడి పెరిగి మనస్తాపంతో చంద్రమోహన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ రమేశ్​ వెల్లడించారు. లోన్ యాప్​కు సంబంధించిన వ్యక్తులు ఎవరినైనా వేధిస్తే అధైర్యపడకుండా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు అండగా ఉంటారని పేర్కొన్నారు.

Chandramohan commits suicide under pressure from loan app telecallers
'టెలికాలర్స్ ఒత్తిడితోనే చంద్రమోహన్ ఆత్మహత్య'
author img

By

Published : Jan 3, 2021, 1:17 PM IST

మేడ్చల్ జిల్లాలో రుణ యాప్​ల వేధింపులు తట్టుకోలేక శనివారం నాడు గుజ్జ చంద్రమోహన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు స్పందించారు. చంద్రమోహన్ మొదటగా కొంత డబ్బు తీసుకుని.. దానిని తీర్చడానికి ఇతర రుణ యాప్​ల ద్వారా డబ్బు తీసుకున్నాడని తెలిపారు. అవి తీర్చకపోవడంతో టెలికాలర్స్ ఒత్తిడి పెరిగి మనస్తాపానికి గురైనట్లు ఇన్ స్పెక్టర్ రమేశ్​ వెల్లడించారు.

యాప్​ల ద్వారా మొదటగా 60 వేల రూపాయలు తీసుకుని.. సుమారు రూ.3లక్షల వరకు చెల్లించినట్లు కుటుంబసభ్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరినైనా లోన్ యాప్​కు సంబంధించిన వ్యక్తులు వేధిస్తే అధైర్యపడకుండా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు అండగా ఉంటారని పేర్కొన్నారు.

రుణయాప్‌ల వేధింపులకు పేట్​బషీరాబాద్ పీఎస్ పరిధిలోని గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ శనివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అవసరాల కోసం 9 యాప్​ల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు రుణాన్ని తీసుకున్న చంద్రమోహన్.. వాటిని తిరిగి కట్టలేకపోయారు.

ఇదీ చూడండి: దా'రుణ' యాప్‌ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.