ETV Bharat / city

CBN: 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు'.. చంద్రబాబు తొలిరోజు దీక్షకు భారీ స్పందన - chandrababunaidu latest news

'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరిట ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) తలపెట్టిన 36 గంటల నిరసన దీక్షకు భారీగా స్పందన వచ్చింది. తొలిరోజు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేతలు, కార్యకర్తల తాకిడి కొనసాగుతూనే ఉంది. వివిధ జిల్లాల నుంచి వచ్చే తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో పోలీసులు, నేతల మధ్య పలుచోట్ల తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

CBN: 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు'.. చంద్రబాబు తొలిరోజు దీక్షకు భారీ స్పందన

author img

By

Published : Oct 21, 2021, 10:24 PM IST

'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు'.. చంద్రబాబు తొలిరోజు దీక్షకు భారీ స్పందన

'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరిట ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) తలపెట్టిన 36 గంటల నిరసన దీక్షకు భారీగా స్పందన వచ్చింది. తొలిరోజు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు దీక్షకు అనుమతిస్తారా ! లేక ఛలో ఆత్మకూరు పర్యటన తరహాలో చంద్రబాబు ఇంటి గేటుకు మళ్లీ తాళ్లు కడతారా! అనే సందేహంతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బుధవారం రాత్రే పెద్దఎత్తున అధినేత నివాసానికి చేరుకున్నారు. వారందరికీ చంద్రబాబు నివాసంలోనే వసతి ఏర్పాటు చేశారు.

తెలుగుతల్లి గీతాలాపనతో..

ఉదయం 8 గంటలకు చంద్రబాబు సభాస్థలికి చేరుకోవాల్సి ఉండగా...అదే మార్గంలో సీఎం పర్యటిస్తుండటంతో పోలీసులు ప్రతిపక్షనేత వాహన శ్రేణిని దారి మళ్లించారు. తాడేపల్లి మీదుగా రావాల్సిన వాహన శ్రేణి మంగళగిరికి వెళ్లి చుట్టూ తిరిగి వచ్చేసరికి 20 నిమిషాలు ఆలస్యమైంది. చంద్రబాబు వాహన శ్రేణి వెంట ఉన్న వాహనాలను పార్టీ కార్యాలయం సర్వీసు రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ సీనియర్‌ నేతలు స్వాగతం పలికి దీక్షాస్థలికి తీసుకెళ్లారు. మా తెలుగుతల్లి గీతాలాపనతో దీక్షాస్థలిపై చంద్రబాబు నిరసన ప్రారంభించారు.

ఆంక్షల కారణంగా..

ఇంటి నుంచి బయలుదేరే ముందు చంద్రబాబు జావా మాత్రమే ఆహారంగా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం పోలీసు ఆంక్షల కారణంగా కార్యకర్తల రద్దీ పలుచగా కనిపించినా... ఆపై వాహనాలు రహదారిపైనే వదిలి దాదాపు కిలోమీటరుపైగా నడిచి పార్టీ శ్రేణులు తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు. దాడి ఎక్కువగా జరిగిన రిసెప్షన్ ప్రాంగణం వద్దే చంద్రబాబు దీక్షకు కూర్చోగా.. అక్కడ చోటు తక్కువగా ఉండటంతో రద్దీ ఏర్పడింది. చంద్రబాబు కూర్చున్న దీక్షాస్థలి ముందు నుంచి కార్యకర్తలు అభివాదం చేస్తూ వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

పోలీసు సంస్మరణ దినోత్సవం రోజే..

తీవ్రవాదం, ముఠా నాయకత్వం, మతవిద్వేష శక్తులు, దేశద్రోహులు, రౌడీలు, సంఘ వ్యతిరేక శక్తులపై పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను గుర్తుంచుకోవాలని..వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించే పవిత్రమైన పోలీసు సంస్మరణ దినోత్సవం రోజే దీక్ష చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా పలుచోట్ల జిల్లాల్లోనూ తెదేపా నేతలు దీక్షలు చేపట్టారు.

ఇదీ చదవండి:

pattabhi remand: తెదేపా నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.