ఏపీ అంతర్వేది ఘటన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర అని వైకాపా శాసనసభ్యురాలు ఆర్కే రోజా ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిందని మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో వెల్లడించారు.
ప్రతిపక్షాల కుట్ర...
ముఖ్యమంత్రికి ఒక మతాన్ని ఆపాదించేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు.
సీబీఐతో అన్ని విషయాలు వస్తాయి..
సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆసరాతో రాష్ట్రంలోని మహిళలు లక్షాధికారులు కాబోతున్నారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు