ఏపీలో జరగనున్న పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలే అజెండాగా ఈ పర్యటన సాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
4వ తేదీన కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, 8న గుంటూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. ఆయా ప్రాంతాల్లో రోడ్ షో లను నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: అక్రమార్కులకు మంత్రి తలసాని అండదండలు:మర్రి