ETV Bharat / city

జగన్​ ఇంటికే.. రాష్ట్రాన్ని రక్షించేది మేమే : చంద్రబాబు - టీడీపీ మహానాడు

chandrababu in mahanadu: వైకాపా పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు కురిపించారు. కరోనా కన్నా.. రాష్ట్ర విభజన కన్నా.. జగన్ విధానాలతోనే ఏపీ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడు రెండో రోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి బాబు ప్రసంగించారు. జగన్ అధ్వాన పాలనతో రాష్ట్రం అంథకారంలో కూరుకుపోయిందన్న తెదేపా అధినేత.. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత తమదేనని అన్నారు.

జగన్​ ఇంటికే.. రాష్ట్రాన్ని రక్షించేది మేమే

author img

By

Published : May 29, 2022, 8:25 AM IST

chandrababu in mahanadu:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైకాపా ఓటమి తథ్యమని జగన్‌ను ఇంటికి పంపించేందుకు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఒంగోలు మహానాడులో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అశేషప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తెదేపా అధినేత.. సీఎం జగన్​పై, వైకాపా పాలనపై నిప్పులు చెరిగారు.

ఏపీని అప్పులపాలు చేసి, దివాళా అంచున నిలిపిన జగన్​ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది వెనుకబడిన వర్గాలు కాదని... సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలేనని చంద్రబాబు విమర్శించారు. సుబ్రమణ్యం హత్య కేసులో తెదేపా పోరాటంతో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారని చెప్పారు . మరి వివేకానందరెడ్డి. హత్య కేసులో అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రిని అరెస్టు చేయగలరా? అని సవాల్ చేశారు.

"బాబాయిని చంపి గొడ్డలి పోటును గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా ? కోడి కత్తి కేసు ఏమైంది?నీకు రోషం ఉంటే.. మీ బాబాయిని హత్య చేసిన వారిని అరెస్టు చేయాలి. రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు జగన్‌ చెప్పారా ? లేదా ? వేల కోట్లు ఖర్చు చేసి అమరావతి నిర్మిస్తే.. దాన్ని నిర్వీర్యం చేశారు. అమరావతి పోవడం వల్ల రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైంది." -చంద్రబాబు, తెదేపా అధినేత

మూడేళ్లలో జగన్‌ దోచుకున్నది రూ.1.75లక్షల కోట్లు: వైకాపా ప్రభుత్వం రూ.8లక్షల కోట్లు అప్పు చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరిట రూ.లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. నిజమైన సంక్షేమం అంటే తెదేపా పథకాలేనని చెప్పారు. రూ.8 లక్షల కోట్ల అప్పును జగన్‌ చెల్లిస్తారా ? అని నిలదీశారు. 'క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.9 ఉండేది. కానీ ఈ ప్రభుత్వం రూ.21 చేసింది. ఇందులో రూ.12 జగన్‌ జేబులోకి వెళ్తున్నాయి. ప్రతి క్వార్టర్‌పై జగన్‌ వాటా రూ.12. జంగారెడ్డిగూడెంలో 22 మంది కల్తీ సారాకు బలయ్యారు. ఏ మద్యం షాపులో కూడా బిల్లు ఇవ్వడం లేదు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ లేదు. లిక్కర్‌ ద్వారా ఏటా జగన్‌ ఆదాయం రూ.5వేల కోట్లు. జగన్‌ మోహన్‌ రెడ్డీ... నీ అవినీతి సొమ్మును కక్కిస్తా. బద్వేలులో 8వేల ఎకరాలు కబ్జా చేశారు. బెదిరించి అన్ని పరిశ్రమలను వైకాపా నేతలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి పంచుకు తింటున్నారు. గూగుల్‌ మ్యాప్‌లు ఉన్నాయి.. అవినీతిని వెలికి తీస్తాం. అన్యాక్రాంతమైన భూమిని ప్రజలకు ఇప్పించే బాధ్యత నాది. జగన్‌ రెడ్డి మూడేళ్ల పాలనలో రూ.1.75లక్షల కోట్లు దోచుకున్నారు.' అని చంద్రబాబు ఆరోపించారు.

నేను ఆ ఉద్యోగాలు ఇచ్చా.. జగన్ ఈ జాబులు ఇచ్చారు..!: తాను ముఖ్యమంత్రిగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే.. జగన్‌ వాలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి.. చివరికి కండీషన్లు పెట్టారని మండి పడ్డారు. కరోనా కంటే.. రాష్ట్ర విభజన కంటే.. జగన్‌ విధానాల వల్లే ప్రజలకు ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. 30లక్షల ఇళ్లు కట్టిస్తానని మూడేళ్లలో 3 ఇళ్లు కట్టారని ఎద్దేవా చేశారు. బాబాయిని చంపి గొడ్డలి పోటును గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? అని నిలదీశారు. కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. జగన్​కు రోషం ఉంటే.. బాబాయిని హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అమరావతిని నిర్వీర్యం చేశారని మండి పడ్డారు. అమరావతి స్తంభించిపోవడం వల్ల రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు.

సినిమాలపైనా దాడి..: జగన్ సర్కారు సినిమాలపైనా దాడి చేసిందని ధ్వజమెత్తారు. బాలకృష్ణ సినిమాపై జగన్‌ ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని, అయినా అడ్డంకులను అధిగమించి అఖండ సినిమా విజయం సాధించిందన్నారు. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకోవాలని జగన్‌ చూస్తున్నారని మండిపడ్డారు. "బాదుడే బాదుడు"కు పోటీగా.. గడపగడపకు ప్రభుత్వం అని నిర్వహించారని, కానీ.. గడపగడపకు వెళ్తే మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారని చంద్రబాబు అన్నారు. దీంతో.. గడపగడపకు కార్యక్రమాన్ని రద్దు చేసి బస్సుయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

క్విట్‌ జగన్‌ - సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌..
అని 5కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీని కాపాడుకోవాలని ప్రజలు ముందుకు వచ్చారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ప్రజలు సభకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడమే కాదు.. కారు టైర్లలో గాలి తీశారు. తెదేపా వెంట ప్రజలు ఉన్నారు.. వైకాపా వెంట బస్సులు ఉన్నాయి. అదుపు తప్పితే పోలీసులను నియంత్రించే శక్తి తెలుగు సైన్యానికి ఉంది. ప్రజలకోసం పోరాడుతాం. కొండనైనా బద్దలు కొట్టే శక్తి తెలుగుదేశం శ్రేణులది. ఈరోజు జగన్‌కు నిద్రరాదు. బస్సు యాత్ర పెడితే నమ్ముతారనుకున్నారు. బాదుడే బాదుడుకు పోటీగా గడప గడపకు ప్రభుత్వం అని నిర్వహించారు. గడప గడపకు వెళ్తే మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. వాళ్ల మీటింగ్‌లు వెల వెల.. మన మీటింగ్‌ కళ కళ అని ఎద్దేవా చేశారు.

సోషల్‌ మీడియానే ఆయుధం: వైకాపా సర్కారు అరాచకాలను యువత ఎండగట్టాలని, అందుకు సోషల్‌ మీడియాను ఆయుధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మీడియాను కూడా వైకాపా నేతలు బెదిరిస్తున్నారన్న బాబు.. ఫోన్ ద్వారానే వారి సర్కారు బండారం బయటపెట్టాలని సూచించారు. తాను తీసుకొచ్చిన సంస్కరణల ద్వారానే అందరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉందని, సెల్‌ఫోన్‌ ద్వారా సామాజిక ఉద్యమం చేపట్టి, జగన్‌ ప్రభుత్వానికి ఉరేసి బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.

ఎన్టీఆర్ అశయాలను సాధిస్తాం: శత జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఆశయాలను నెమరువేసుకోవాలని బాబు అన్నారు. భవిష్యత్‌లో కూడా ఎన్టీఆర్‌ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని అన్నారు. ఆయన శతజయంతి సందర్భంగా.. ఈ ఏడాదంతా పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టి, ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో మహానాడు పెడతామని, వైకాపా అవినీతిని ఎండగడుతూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

జగన్ ను ఇంటికి పంపాలని జనం చూస్తున్నారు: రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపాల్సిందేనని బాబు పిలుపునిచ్చారు. త్వరగా జగన్‌ను ఇంటికి పంపాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు ముందుకు వచ్చారని అన్నారు. ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారన్న బాబు.. వారి కోరిక త్వరలోనే తీరుతుందన్నారు.

"ఎన్నికల ముందు చెప్పిన ప్రత్యేక హోదా ఏమైంది ? రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని హోదా కోసం పోరాడాం. 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోయాయి.. కొత్తవి వస్తాయని కూడా నమ్మకం లేదు. జగన్‌ ఆదాయం పెరుగుతోంది... ప్రజల ఆదాయం తగ్గుతోంది. సామాజిక న్యాయానికి గొడ్డలి పెట్టు వైకాపా. జిల్లాల విభజనపై సమీక్ష చేసి అందరికీ న్యాయం చేస్తాం. వైకాపా అరాచకాలపై యుద్ధం ప్రకటించాం. వీరోచితంగా పోరాడండి. తాటాకు చప్పుళ్లకు భయపడం. మీలాంటి వాళ్లను చాలా మందిని చూశాం. జగన్‌ లాంటి వాళ్లు రాష్ట్రానికి అరిష్టం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత 5కోట్ల ప్రజలపై ఉంది. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనదే. ప్రజల్లోకి వెళ్లి వారిని చైతన్యపరిచి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రజలకు అండగా నిలవాలి. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి మిమ్మల్ని కాపాడుకుంటా." -చంద్రబాబు, తెదేపా అధినేత

జగన్​ ఇంటికే.. రాష్ట్రాన్ని రక్షించేది మేమే

ఇదీ చదవండి: చేరిన కళాశాల నుంచే మరో వర్సిటీలో చదువుకోవచ్చు

మరుగుజ్జుల పెళ్లి.. 36 అంగుళాల వరుడు.. 31 అంగుళాల వధువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.