ETV Bharat / city

జగన్​ ఇక ఇంటికే.. ఏపీని రక్షించేది మేమే: చంద్రబాబు - టీడీపీ మహానాడు

వైకాపా పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు కురిపించారు. కరోనా కన్నా.. రాష్ట్ర విభజన కన్నా.. జగన్ విధానాలతోనే ఏపీ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడు రెండో రోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి బాబు ప్రసంగించారు. జగన్ అధ్వాన పాలనతో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందన్న తెదేపా అధినేత.. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత తమదేనని అన్నారు.

babu in mahanaadu
babu in mahanaadu
author img

By

Published : May 28, 2022, 10:26 PM IST

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైకాపా ఓటమి తథ్యమని.. జగన్‌ను ఇంటికి పంపించేందుకు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఒంగోలు మహానాడులో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అశేషప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తెదేపా అధినేత.. సీఎం జగన్​పై, వైకాపా పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, దివాళా అంచున నిలిపిన జగన్​ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

సంక్షేమం మాటున భారీ దోపిడీ..: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రూ.8లక్షల కోట్లు అప్పు చేసిందన్న బాబు.. సంక్షేమ పథకాల పేరిట రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. వైకాపా సర్కారు చేసిన రూ.8లక్షల కోట్ల అప్పును జగన్‌ చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. ప్రతి రూపాయినీ ప్రజలే చెల్లించాల్సి వస్తుందని, ఇష్టారీతిన అప్పులు చేసి, జనం నెత్తిన మోయలేని భారం మోపారని ధ్వజమెత్తారు.

జగన్ ఆదాయం రూ.5 వేల కోట్లు..: మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న జగన్ సర్కారు.. ప్రజల నుంచి యథేచ్ఛగా దోపిడీ చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్‌ బాటిల్‌ తయారీ ధర రూ.9 ఉండేదని, ఈ ప్రభుత్వం దాన్ని రూ.21కి పెంచిందన్నారు. ఇందులో రూ.12 జగన్‌ జేబులోకే వెళ్తున్నాయని మండిపడ్డారు. ఏ మద్యం షాపులో కూడా బిల్లు ఇవ్వడం లేదని, ఆన్‌లైన్‌ పేమెంట్‌ లేదని, ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం లిక్కర్‌ ద్వారానే ఏటా జగన్‌ రూ.5వేల కోట్లు దోచుకుంటున్నారన్న బాబు.. ఈ మూడేళ్ల పాలనలో రూ.1.75లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. పాలకుల అవినీతిని వెలికి తీస్తామన్న బాబు.. అన్యాక్రాంతమైన భూమిని ప్రజలకు ఇప్పించే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు.

నేను ఆ ఉద్యోగాలు ఇచ్చా.. జగన్ ఈ జాబులు ఇచ్చారు..: తాను ముఖ్యమంత్రిగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే.. జగన్‌ వాలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి.. చివరికి కండీషన్లు పెట్టారని మండి పడ్డారు. కరోనా కంటే.. రాష్ట్ర విభజన కంటే.. జగన్‌ విధానాల వల్లే ప్రజలకు ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. 30లక్షల ఇళ్లు కట్టిస్తానని మూడేళ్లలో 3 ఇళ్లు కట్టారని ఎద్దేవా చేశారు. బాబాయిని చంపి గొడ్డలి పోటును గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? అని నిలదీశారు. కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. జగన్​కు రోషం ఉంటే.. బాబాయిని హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అమరావతిని నిర్వీర్యం చేశారని మండి పడ్డారు. అమరావతి స్తంభించిపోవడం వల్ల రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు.

సినిమాలపైనా దాడి..: జగన్ సర్కారు సినిమాలపైనా దాడి చేసిందని ధ్వజమెత్తారు. బాలకృష్ణ సినిమాపై జగన్‌ ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని, అయినా అడ్డంకులను అధిగమించి అఖండ సినిమా విజయం సాధించిందన్నారు. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకోవాలని జగన్‌ చూస్తున్నారని మండిపడ్డారు. "బాదుడే బాదుడు"కు పోటీగా.. గడపగడపకు ప్రభుత్వం అని నిర్వహించారని, కానీ.. గడపగడపకు వెళ్తే మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారని చంద్రబాబు అన్నారు. దీంతో.. గడపగడపకు కార్యక్రమాన్ని రద్దు చేసి బస్సుయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

క్విట్‌ జగన్‌ - సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌..: అని 5కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు ముందుకు వచ్చారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ప్రజలు సభకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడమే కాదు.. కారు టైర్లలో గాలి తీశారు. తెదేపా వెంట ప్రజలు ఉన్నారు.. వైకాపా వెంట బస్సులు ఉన్నాయి. అదుపు తప్పితే పోలీసులనూ నియంత్రించే శక్తి తెలుగు సైన్యానికి ఉంది. ప్రజలకోసం పోరాడుతాం. కొండనైనా బద్దలు కొట్టే శక్తి తెలుగుదేశం శ్రేణులది. ఈరోజు జగన్‌కు నిద్రరాదు. బస్సు యాత్ర పెడితే నమ్ముతారనుకున్నారు. బాదుడే బాదుడుకు పోటీగా గడప గడపకు ప్రభుత్వం అని నిర్వహించారు. గడప గడపకు వెళ్తే మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. వాళ్ల మీటింగ్‌లు వెల వెల.. మన మీటింగ్‌ కళ కళ అని ఎద్దేవా చేశారు.

సోషల్‌ మీడియానే ఆయుధం..: వైకాపా సర్కారు అరాచకాలను యువత ఎండగట్టాలని, అందుకు సోషల్‌ మీడియాను ఆయుధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మీడియాను కూడా వైకాపా నేతలు బెదిరిస్తున్నారన్న బాబు.. ఫోన్ ద్వారానే వారి సర్కారు బండారం బయటపెట్టాలని సూచించారు. తాను తీసుకొచ్చిన సంస్కరణల ద్వారానే అందరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉందని, సెల్‌ఫోన్‌ ద్వారా సామాజిక ఉద్యమం చేపట్టి, జగన్‌ ప్రభుత్వానికి ఉరేసి బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.

ఎన్టీఆర్ అశయాలను సాధిస్తాం..: శత జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఆశయాలను నెమరువేసుకోవాలని బాబు అన్నారు. భవిష్యత్‌లో కూడా ఎన్టీఆర్‌ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని అన్నారు. ఆయన శతజయంతి సందర్భంగా.. ఈ ఏడాదంతా పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టి, ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో మహానాడు పెడతామని, వైకాపా అవినీతిని ఎండగడుతూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

జగన్ ను ఇంటికి పంపాలని జనం చూస్తున్నారు..: రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపాల్సిందేనని బాబు పిలుపునిచ్చారు. త్వరగా జగన్‌ను ఇంటికి పంపాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు ముందుకు వచ్చారని అన్నారు. ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారన్న బాబు.. వారి కోరిక త్వరలోనే తీరుతుందన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.