ETV Bharat / city

'నలభై ఏళ్ల ప్రస్థానం చాటేలా.. మహానాడు'

Chandrababu Review On Mahanadu: నలభై ఏళ్ల ప్రస్థానం చాటేలా.. భవిష్యత్ ప్రయాణాన్ని నిర్దేశించేలా మహానాడు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడు నిర్వహణ కమిటీలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. ప్రజల స్పందన చూస్తుంటే ఈసారి ప్రభంజనంలా మహానాడు ఉండబోతోందన్నారు.

chandrababu
chandrababu
author img

By

Published : May 23, 2022, 10:34 PM IST

Chandrababu Review On Mahanadu: తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును ఘనంగా నిర్వహించాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని చెప్పారు. భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్ధేశం చేసేలా కార్యక్రమం ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన చూస్తే.. ప్రభంజనంలా మహానాడు ఉండబోతుందన్నారు. ఈ నెల 27,28 తేదీల్లో ఏపీ ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుపై కమిటీలతో చంద్రబాబు సమీక్షించి పలు సూచనలు చేశారు. మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు 12 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పార్టీ నేతలు వివరించారు. ఇక రెండో రోజు జరిగే బహిరంగ సభను లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

ఒంగోలులో మహానాడు నిర్వహణ తలపెట్టిన నాటి నుంచి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని నేతలు మండిపడ్డారు. మొదట ఒంగోలులోని మీని స్టేడియం ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం.., తరువాత కూడా పలు అడ్డంకులు సృష్టిస్తుందని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మహానాడుకు వాహనాలు సమకూర్చుకునే విషయంలో రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని నేతలు చెప్పారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని చంద్రబాబు అన్నారు. మహానాడు అనేది పార్టీ పండుగ అయినప్పటికీ.. ఈ సారి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందని చెప్పారు. మహానాడుకు సౌకర్యాలు,వేదిక నిర్మాణం, భోజన వసతి కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వివరించారు.

తన రాయలసీయ పర్యటనకు కూడా పోలీసులు సహకరించలేదన్న చంద్రబాబు.., మహానాడుకు కూడా వారు సహకరించే అవకాశం లేదన్నారు. పార్టీ కార్యకర్తల సహకారంతోనే కార్యక్రమం పటిష్ఠంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎప్పుడూ ఉండే పార్టీ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్పారు. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉందన్న చంద్రబాబు.., మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ ప్రతిపాదనలు సిద్దం చేస్తుందని తెలిపారు.

ఇవీ చదవండి: గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం లేఖ

ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన

అందులో నటించనన్న సాయిపల్లవి.. బొమ్మరిల్లు భాస్కర్​తో చైతూ మూవీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.