ETV Bharat / city

'అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించండి... పదవులు వదిలేస్తాం' - chandrababu comments on Jagan

తాను ఇచ్చిన సవాల్​కు భయపడి ముందుకు రాని ఏపీ సీఎం జగన్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరో సవాల్ చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని... అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే తాము రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు జగన్‌ ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించి ద్రోహం చేశారని ఆరోపించారు. వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఎలా మాట తప్పారో.. మడమ తిప్పారో ప్రజలు తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇవాళ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలన్న చంద్రబాబు... వైకాపా నేతల వీడియోలు మీడియాకు చూపించారు.

chandra babu
chandra babu
author img

By

Published : Aug 5, 2020, 6:02 PM IST

అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించే అంశంపై వైకాపా నేతలు రాజీనామా చేయమని 48 గంటలు సమయం ఇచ్చానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పోరాటం తన కోసం కాదు... భవిష్యత్తు తరాల కోసమేనని స్పష్టం చేశారు. న్యాయం రైతుల వైపు ఉంది కాబట్టే కోర్టులోనూ స్టేటస్ కో వచ్చిందని పేర్కొన్నారు. ఇవాళ రామ మందిరానికి శంకుస్థాపన జరిగిన రీతిలోనే అమరావతి శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. పార్లమెంటు మట్టి , యమునా నది జలాలను తీసుకొచ్చిన ప్రధాని అండగా ఉంటామని ఆనాడు హామీ ఇచ్చారని చెప్పారు.

రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారా.. లేదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. మీరు చేసే పనులు సరైనవని అనిపిస్తే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ప్రజా ప్రయోజనాలు వదిలి నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్నీ మరిచిపోయి ఇవాళ మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికల ముందే చెప్పానన్న చంద్రబాబు... వేలమంది రైతులు రహదారులపై ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిపై మీరు ఎన్నిరకాలుగా మాట్లాడతారని వైకాపా నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం.. రండి అని సవాల్ చేశారు. రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలన్న చంద్రబాబు... కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలని కోరారు. వైకాపా, కాంగ్రెస్ నేతలు జగన్‌ను నిలదీయాలన్న చంద్రబాబు... అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పని పేర్కొన్నారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని హితవు పలికారు. రాజధానిని మార్చే అధికారం వైకాపాకు లేదని స్పష్టం చేశారు.

రామాలయానికి భూమిపూజ చేయడం శుభకరమని చంద్రబాబు పేర్కొన్నారు. రామాలయం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారన్న చంద్రబాబు... 200 నదుల పవిత్ర జలాలతో భూమిపూజ చేశారని వివరించారు. అమరావతిలో 30 నదుల పుణ్యజలాలతో భూమిపూజ చేశారని గుర్తుచేశారు. అమరావతికి అండగా ఉంటామని శంకుస్థాపన సమయంలో ప్రధాని చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ముందు వైకాపా నేతలు ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. ప్రజలను నమ్మించి ద్రోహం చేశారు, వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.

ఇప్పుడు సవాల్ చేస్తే ఏదోదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని... అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. ఈ సవాల్​కు సిద్ధపడి జగన్​ తన నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.