ETV Bharat / city

'మంత్రి పదవులు వారికే దక్కాయి.. వైకాపాలోనే ఈ ప్రచారం' - చంద్రబాబు న్యూస్

CBN fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ పాలనతో ఏపీలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకుందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ బలహీనత కేబినెట్ కూర్పులోనే తేలిపోయిందని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు వైకాపాలోనే ప్రచారం జరుగుతోందని అన్నారు.

chandrababu naidu
చంద్రబాబు నాయుడు
author img

By

Published : Apr 18, 2022, 5:20 PM IST

CBN fires on CM Jagan: బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు వైకాపాలోనే ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన.. జగన్ బలహీనత కేబినెట్ కూర్పులోనే తేలిపోయిందని విమర్శించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా అసంతృప్తితోనే ఉందన్నారు. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో ఆంధ్రప్రదేశ్​ విభజన కంటే ఎక్కువ నష్టమన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకుందన్నారు.

నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయి రెడ్డి మూడేళ్లు దోచుకున్నారని.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా? అని నిలదీశారు. పింఛన్​ ఒకటో తేదీనే ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛను ఇవ్వటంలేదని దుయ్యబట్టారు. ఈనెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

"జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకుంది. జగన్ ఒక అపరిచితుడు.. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయి. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతవర్గం కూడా అసంతృప్తితో ఉంది. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. జగన్ బలహీనత.. కేబినెట్ విస్తరణ చూస్తేనే అర్థమవుతోంది. వైకాపాలో అసంతృప్తి కేబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడింది. బ్లాక్‌మెయిల్ చేసిన వారికే పదవులు ఇచ్చినట్లు వైకాపాలోనే ప్రచారం." -చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి: బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు తెరాస శ్రేణుల యత్నం... ఉద్రిక్తత

'అతడ్ని పెళ్లి చేసుకో'.. బలవంతపెట్టిన భర్త.. 15 మందితో కలిసి దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.