ETV Bharat / city

Chandrababu meeting: ఆ జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ - Chandrababu meets leaders

Chandrababu meeting with leaders: ఏపీలోని విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తెదేపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు.. 12 మందితో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు తెదేపా కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం.

Chandrababu meeting
ఆ జిల్లాల నేతలతో నేడు చంద్రబాబు భేటీ
author img

By

Published : Feb 18, 2022, 1:01 PM IST

Chandrababu meeting with leaders: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు.. 12 మందితో తెదేపా అధినేత చంద్రబాబు నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. మాజీ మంత్రి, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా ఆ జిల్లా నుంచి విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఇన్‌ఛార్జి పల్లా శ్రీనివాస్, తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులను పిలిచారు.

ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం. త్వరలో వచ్చి చంద్రబాబును కలుస్తానని పార్టీ కార్యాలయానికి ఆయన సమాచారమిచ్చినట్టు తెలిసింది. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి ఇన్‌ఛార్జి బేబినాయన, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఇన్‌ఛార్జి పెందుర్తి వెంకటేష్‌ తదితరులను చంద్రబాబుతో సమావేశానికి రమ్మని పార్టీ కార్యాలయం నుంచి వర్తమానం వెళ్లింది.

రెండో రోజు..

ఎన్టీఆర్‌ భవన్‌లో రెండో రోజు సర్పంచుల సదస్సు జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. కొత్త సర్పంచులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో ప్రకాశం, నెల్లూరు, తూ.గో. జిల్లాల సర్పంచులు పాల్గొంటారు.

ఇదీ చదవండి : Chandrababu Land: చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జాకు యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.