TDP Parliamentary meeting: ఆంధ్రప్రదేశ్‌లో సంభవించే వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(tdp Parliamentary Party on rains in ap) నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాల్లో(tdp on Winter Session of Parliament 2021) ప్రస్తావించాల్సిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఈ మేరకు పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పెట్రో ధరలపై ఏపీలో అధిక పన్నుల ప్రస్తావనతో(petrol taxes in andhra pradesh) పాటు.. ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లు (ap three capitals bill)అంశాలు లేవనెత్తాలని నిర్ణయించారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులతో పాటు ఉపాధి హామీ నిధులు మళ్లింపుపైనా పార్లమెంటులో లేవనెత్తాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు.
రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించాలని చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్ సరఫరాపై లేవనెత్తాలని సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని చంద్రబాబు తీర్మానించారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి రూ. 40 కోట్ల సుఫారీ, ఈడీ విచారణ అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు.
పార్లమెంటరీ పార్టీ సమావేశం తీర్మానాలు:
- దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై జగన్ ప్రభుత్వం పన్నులు, నిత్యావసర ధరల పెరుగుదల, ప్రత్యేకహోదా, 3 రాజధానుల బిల్లు వంటి అంశాలపై లేవనెత్తాలని నిర్ణయం.
- ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్ సరఫరా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తనున్నారు.
- వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన
- వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడటం దేశానికి అన్నపూర్ణగా పిలవబడిన ఆంధ్రప్రదేశ్‌లో వరి పంట వేయరాదని మంత్రులు ప్రకటించిన అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.
- వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్ల సుఫారీ, అడ్వాన్సుగా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణ
- పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మళ్లింపు, ఉపాధి హామీ నిధులు మళ్లింపు, ఈఏపీ నిధులు దారిమళ్లింపు
- బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయం.
ఇదీ చదవండి: KISHAN REDDY COMMENTS ON KCR: 'ధర్నాచౌక్‌లో కేసీఆర్ ధర్నా రైతుల కోసం కాదు'
Revanth in Vari Deeksha: 'వరి కొనకపోతే.. నడిబజార్ల ఉరి తీయటం ఖాయం'