ETV Bharat / city

రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేయాలి: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వం అన్నదాతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ...రైతుకు వ్యతిరేకంగా పని చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవోలను భోగిమంటల్లో వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గత ఏడాదిన్నరలో 17 వందల 79మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేయాలి: చంద్రబాబు

author img

By

Published : Jan 12, 2021, 4:29 PM IST

రైతు ద్రోహిగా ఏపీ సీఎం జగన్ మారారని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గత ఏడాదిన్నరలో 17 వందల 79మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. తెదేపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన...రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 55శాతం పెరిగాయన్నారు. 400రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. 30వేల రైతు కుటుంబాలను రోడ్డుకీడ్చారని తప్పుబట్టారు.

తెదేపా తెచ్చిన రైతు సంక్షేమ పథకాలను రద్దు చేశారని... రైతుల సంక్షేమాన్ని కాలరాశారని విమర్శించారు. ఉచిత కరెంటుకు ఎగనామం పెడుతున్నారన్నారు. స్థానిక ఎన్నికలకు వైకాపా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని తప్పుబట్టారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఓటమే అందరి లక్ష్యం కావాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

అన్నదాతలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 5 జీవోలను భోగిమంటల్లో వేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. రుణమాఫీ సొమ్మును రైతులకు అందకుండా చేసిన జీవో 99, కౌలు రైతులకు అన్యాయం చేస్తూ సర్కారు తీసుకొచ్చిన జీవో 96, ప్రకృతి వ్యవసాయానికి అందాల్సిన నిధులను పక్కదారి పట్టిసూ జారీ చేసిన జీవో 417, సున్నా వడ్డీకి సంబంధించిన జీవో 464, విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తూ తీసుకొచ్చిన జీవో 22.. ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని సూచించారు.

కృష్ణా జిల్లా పరిటాలలో భోగి మంటల కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతిని గ్రామగ్రామాన ఘనంగా జరపాలని సూచించారు. లెజండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం చేయాలని సూచించారు.

ఇదీ చదవండి: 'డిసెంబరు నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.