ETV Bharat / city

'కేసులు పెరుగుతున్నాయ్​.. విద్యాసంస్థలకు వెంటనే సెలవులివ్వాలి' - చంద్రబాబు న్యూస్

CBN On Holidays For Schools: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలోని పాఠశాలలకు వెంటనే సెలవులు ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా వల్ల 12 రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారని బాబు గుర్తు చేశారు.

chandra babu naidu
చంద్రబాబు నాయుడు
author img

By

Published : Jan 17, 2022, 5:10 PM IST

CBN On Holidays For Schools: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు వెంటనే సెలవులు ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కరోనా వల్ల 12 రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారని గుర్తు చేశారు.

రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ధాన్యం రైతులకు సకాలంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన కంది, మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కేసినో కల్చర్, పేకాట క్లబ్బులు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. గుడివాడలో క్యాసినో నిర్వహించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్​ భేటీ.. రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.