ETV Bharat / city

ఏపీ: దర్యాప్తు బాధ్యత పోలీసులదా? ప్రతిపక్షానిదా?: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​లో దుర్మార్గులకు లైసెన్స్​లిచ్చి అరాచకాలు చేయిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు పోలీసులు అండగా ఉండాలే తప్ప నేరగాళ్లకు వత్తాసు పలకరాదని హితవు పలికారు.

chandrababu-about-police-officers
ఏపీ: దర్యాప్తు బాధ్యత పోలీసులదా? ప్రతిపక్షానిదా?: చంద్రబాబు
author img

By

Published : Sep 29, 2020, 8:32 PM IST

సీల్డ్ కవర్​లో సాక్ష్యాధారాలు పంపాలని ఏపీ డీజీపీ తనకు లేఖ రాయడం హాస్యాస్పదమని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. "సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట. ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా, ప్రతిపక్షానిదా?" అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయా? అని చంద్రబాబు నిలదీశారు. కొందరు పోలీసుల ఉదాసీనత చూసి నేరగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఏపీలో వైకాపా అరాచకాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయన్నారు.

రామచంద్రపై దాడికి రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ, డీఎస్పీ మొదట చెప్పారని సాయంత్రానికల్లా కుమార్ రెడ్డి పేరుకు బదులు ప్రతాప్ రెడ్డి పేరు తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. వ్యవస్థలను ఏవిధంగా మేనేజ్ చేస్తున్నారో ఇదే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. వైకాపా నాయకులపై, సీఎం జగన్ బంధువులపై కేసులు ఎత్తేస్తున్నారని, ఏ నేరం చేయక పోయినా తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఒకవైపు కరోనా, మరోవైపు వరదలు జన జీవనాన్ని దుర్భరం చేశాయని, ప్రభుత్వానికి ఎలాంటి ముందు జాగ్రత్తలు లేవని చంద్రబాబు మండిపడ్డారు. రైతులకు వైకాపా తీరని ద్రోహం చేసిందని, మీటర్ల పేరుతో ఉచిత విద్యుత్ ఎగ్గొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాత పథకాలకు పేర్లు మార్పే తప్ప కొత్త పథకాలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి: చంద్రబాబుకు డీజీపీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.